జీ తెలుగు నా సొంత కుటుంబంలా అనిపిస్తోంది : నమిత
on Nov 24, 2022
జీ తెలుగులో ప్రసారమవుతున్న షో డాన్స్ ఇండియా డాన్స్ ప్రతీ వారం కొత్త కొత్త గెస్టులను తీసుకొస్తూ ఎంటర్టైన్ చేస్తోంది. ఇక ఇప్పుడు ఈ షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి ఈ ఆదివారం ఒకప్పటి నటి నమిత తన భర్తతో కలిసి ఈ షోకి వచ్చింది. నమిత నటించిన "సొంతం" మూవీలోని "తెలుసునా" అనే సాంగ్ కి స్టేజి మీద అద్భుతంగా డాన్స్ చేశారు.
ఇంకా డాన్స్ తర్వాత నమిత మాట్లాడుతూ "కోవిడ్ టైంలో మ్యారేజ్ చేసుకున్న కపుల్స్ అందరూ పిల్లల్ని కనడానికి మంచి టైంగా ప్లాన్ చేసుకున్నారు. నాకు కూడా ఆ కోవిడ్ టైం కలిసి వచ్చింది. నేను కూడా పిల్లల్ని కనడానికి ప్లాన్ చేసుకున్నా." నమిత వచ్చిరాని తెలుగులో గమ్మత్తుగా చెప్పేసరికి అందరూ నవ్వేశారు.
ఇక అకుల్ బాలాజీ మాట్లాడుతూ "ఒక్కరితో కాదు ఇద్దరితో ఫినిష్ చేశారు" అన్నాడు ఫన్నీగా..ఇక జీ తెలుగు తమ ఇంట్లోకి వచ్చిన ఆడపడుచుగా భావించి నమితకు చీరా సారె పెట్టారు. "జీ ఛానల్ కి వస్తే నా సొంత కుటుంబంలోకి వచ్చినట్టుగా అనిపిస్తోంది" అని నమిత చెప్పింది. ఇక నమిత ఇటీవల ట్విన్స్ కి జన్మనిచ్చిన విషయం తెలిసిందే.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
